జగనన్న దెబ్బకు టిడిపి దుకాణం బంద్ అవుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎద్దేవా చేశారు.
1.
జగనన్న దెబ్బకు టిడిపి దుకాణం బంద్ అవుతోందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఎద్దేవా చేశారు. తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా నేతృత్వంలో గుంటూరు ఈస్ట్ యువజన నగర అధ్యక్షులు సూరజ్ ఆధ్వర్యంలో
నియోజకవర్గంలోని ఆనంద్ పేట,
తెలుగు యువత ముఖ్య నాయకులు
ఏజస్, రహీం , అబుసర్ , సోను ,వసీం , ఎమ్మెల్యే ముస్తఫా ,మరియు నూరిఫాతిమా చేతులు మీదుగా వైసీపీ తీర్థం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ
నగరంలోని యువత అంతా గత టీడీపీ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడుతున్నారని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గంలో తన కుమార్తె నూరిఫాతిమాను భారీ మెజారిటీతో గెలిపించుకుని సీఎం జగన్ కు , బహుమతిగా ఇవ్వాలని కోరారు.
సమన్వయకర్త
నూరిఫాతిమా మాట్లాడుతూ.
పార్టీ లో జాయిన్ అయిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో యువతాంత కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసేందుకు కృషి చేయాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో అంజుమాన్ గుంటూరు అధ్యక్షులు కర్నూమ, వైసీపీ జనరల్ సెక్రెటరీ గులాం రసూల్, స్థానిక కార్పొరేటర్ అభిద్, వైసీపీ ముఖ్య నాయకులు బషీర్ భాయ్, కళ్ళం హరికృష్ణ రెడ్డి,గౌస్, తదితరులు పాల్గొన్నారు.